- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది స్కీముల ప్రభుత్వం కాదు.. స్కాముల సర్కార్ : హరీష్ రావు
కేబినెట్ లో స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే హరీష్ రావు విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ లో స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే హరీష్ రావు విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా విద్యుత్ కుంభకోణానికి తెరలేపారని, కాంగ్రెస్ పాలనలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఒక్క రామగుండం ప్రాజెక్టులోనే రూ.5-6 వేల కోట్ల కమీషన్ దండుకునేలా ప్లాన్ చేశారన్నారు. మంత్రులకు కమీషన్ల పంపకాల కోసమే కేబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయని, ప్రజల సమస్యలు, అమలు చేయాల్సిన పథకాలపై చర్చించడం లేదని దుయ్యబట్టారు.
ఎన్టీపీసీ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్లే చేసి చూపించారు. ఎన్టీపీసీ ఒప్పందంపై మాట్లాడిన మాటలనే ఉదహరిస్తూ.. రామగుండం 800 మెగావాట్ల ప్రాజెక్టుకు యూనిట్ కు రూ.8 చొప్పున రూ.10,880 కోట్లు ఖర్చవుతుందని చెప్పారని, ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.15 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందన్నారు. అప్పుడు ఒక యూనిట్ కు రూ.10 ఖర్చవుతుందన్నారు. రూ.5కే యూనిట్ విద్యుత్ అందిస్తామన్న సీఎం.. రామగుండం యూనిట్ ను అంత ఖర్చుతో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్షనేతగా రేవంత్ థర్మల్ ప్లాంట్లను వ్యతిరేకించి, ఇప్పుడు సీఎంగా థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో ఎవరు ఏ సమస్యపై ప్రశ్నించినా సీఎం నన్ను కోసుకుని తింటారా? అని అడుగుతున్నారన్నారు. పాల్వంచ, రామగుండం, మత్కల్ .. మూడు ప్రాంతాల్లో ఒక్కో చోట 800 మెగావాట్ల చొప్పున 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లు పెడతానని సీఎం అంటున్నారని, అందుకు సుమారుగా రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. వీటిలో రూ.40 వేల కోట్లు అప్పుగా తీసుకువచ్చినా.. రూ.10 వేలకోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టాలన్నారు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్, ఎస్సీ,ఎస్టీ బీసీలకు స్కాలర్ షిప్, ఉద్యోగుల డీఏ పెంపులపై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి ఈ రూ.10 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఢిల్లీకి అప్పుల కోసం వెళ్తుంటే చెప్పులు ఎత్తుకపోయేవాడిలా తనను చూస్తున్నారన్న రేవంత్ రెడ్డికి.. అప్పు ఎవరిస్తారని ప్రశ్నించారు.
ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంట్ ను ఉత్పత్తి చేశామని, తమతో పీపీఏ ఒప్పందం చేసుకుంటే తక్కువ ధరకే విద్యుత్ ను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ఉత్తరాలు రాసినా రేవంత్ సర్కార్ స్పందించలేదని విమర్శించారు. ఆ సంస్థ సీఎండీ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా దీనిపై రిక్వెస్ట్ చేశారని, గతంలో బీఆర్ఎస్ సర్కార్ 1600 మెగావాట్ల విద్యుత్ ను తీసుకుందని, మిగతా 2400 మెగావాట్లను సప్లై చేస్తామన్న స్పందించలేదని తెలిపారు.






