‘చాలా సంతోషంగా ఉంది’.. ఈటల ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-11 17:45:26  IST  )

ఘట్కేసర్, పిర్జాదిగూడలో కియా ఫౌండేషన్(Kia Foundation) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు 500 నోట్ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు.

‘చాలా సంతోషంగా ఉంది’.. ఈటల ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఘట్కేసర్, పిర్జాదిగూడలో కియా ఫౌండేషన్(Kia Foundation) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు 500 నోట్ బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన యాదగిరి, కిషోర్‌ను అభినందించారు. స్కూల్‌లో సరిపోయేంత మంది స్టాఫ్ లేరని.. స్కూల్ వారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఈటల.. తప్పకుండా పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. ప్రభుత్వ స్కూల్ మీద నమ్మకంతో విద్యార్థులు వస్తున్నందుకు వారికి కావాల్సిన టీచర్లు, సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు.

Next Story