- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక లాభం లేదు.. పాదయాత్ర చేస్తా: MP ఈటల రాజేందర్ ట్వీట్
ప్రజాసమస్యల పరిష్కారం కోసం జవహార్ నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం జవహార్ నగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరుబాట కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని.. తక్షణమే స్పందించి కనీస అవసరాలు తీర్చాలని డిమాండ్ చేశారు. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారని ఆరోపించారు. కనీసం అంబులెన్స్ వెళ్లడానికి కూడా దారి లేకుండా చేశారని మండిపడ్డారు. అంతేగాకుండా.. ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్కును కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ‘40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు. ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. వీరికి చివరి వరకూ అండగా నిలబడతా’ అని హామీ ఇచ్చారు.
‘బంజారాహిల్స్‌లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No.58, 59 కింద రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. ఇదేం న్యాయం. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అన్యాయం జరుగనివ్వను. అందుకే వారి కోసం రోజూ పక్షి లెక్క తిరుగుతున్నాను. పేదలను రోడ్డున పడేస్తున్న హైడ్రాను సహించం. దమ్ముంటే ముందు పెద్దల ఇల్లు కూలగొట్టి చూపించాలి. పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీతో యుద్ధానికి సిద్ధం. మీ అధికారం, మీ పోలీసులు ఏం చేస్తారో చూస్తాం’ అని ఈటల రాజేందర్ షాకింగ్ ప్రకటన చేశారు. ట్వీట్






