- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్ట కాల్చి మీద వేస్తున్నారు.. CM రేవంత్‌పై ఎంపీ ఈటల ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీజేపీ(BJP) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీజేపీ(BJP) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) కౌంటర్ ఇచ్చారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు.. కేబినెట్ ఆమోదానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఇస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ప్రతీ కేబినెట్ సమావేశంలో.. మంత్రులు తీసుకున్న నిర్ణయాలపై చర్చ చేసేవారని గుర్తుచేశారు. ఇది నిజం కాదని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మించాలి.. కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు.
‘తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం సాగింది. నేను జైళ్లకు పోయాను. నా రక్తం చిందించా. పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది. ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా?. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు నిర్మించతలపెట్టారు. కానీ పూర్తి చేయలేదు’ అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తిచేయాలి. అవినీతి నిగ్గు తేల్చాలి. లేకపోతే విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.






