- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫిర్యాదు !
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎన్నికల సమయంలో కొండా సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ప్రదీప్ రావు వెల్లడించారు. ఇక ఇందులో భాగంగానే కొండా మురళి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ప్రదీప్ రావు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖపై ( KONDA SUREKHA) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు (ERRABELLI PRADEEP RAO ). ఇదే విషయంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. దింతో ఈ వ్యవహారంలో ఈసీ స్పందనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా ఉండగా గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేసి గెలిచామని కొండా మురళి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఎన్నికల కోసం నాకు ఉన్న 500 ఎకరాలలో 16 ఎకరాలు అమ్మేశానని ఈ సందర్భంగా వెల్లడించారు. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతో పోటీ.. నాకు ఎవరు పైసలు ఇవ్వాల్సిన పనిలేదు అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు. ఇక ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే... కొండా సురేఖ ఎన్నికపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు.






