గ్రేటర్ లో తాగునీటి సమస్య రాకుండ చూడండి : సీఎస్ సమీక్ష

by Muthe.Rajitha |

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో రానున్న రోజుల్లో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

గ్రేటర్ లో తాగునీటి సమస్య రాకుండ చూడండి : సీఎస్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో రానున్న రోజుల్లో తాగు నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జలమండలి పని తీరుపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజీరా, సింగూరు, గోదావరి రెండు, మూడో దశ పనులపై సమీక్ష చేశారు. భూసేకరణ, పైప్ లైన్ల నిర్మాణంపై అధికారులతో చర్చించారు.

ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ నిర్దేశించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జలమలండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పీసీసీఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Next Story