సీఎంఆర్ ధాన్యంలో రూ.9.34కోట్ల ఆక్రమాలు

by Ajay Maddhiboyina |

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ వరంగల్ యూనిట్ పరిధిలో చేపట్టిన దాడులలో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి రూ.9.34 కోట్ల ఆక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ శుక్రవారం వెల్లడించారు.

సీఎంఆర్ ధాన్యంలో రూ.9.34కోట్ల ఆక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ వరంగల్ యూనిట్ పరిధిలో చేపట్టిన దాడులలో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి రూ.9.34 కోట్ల ఆక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ శుక్రవారం వెల్లడించారు. హన్మకొండ జిల్లా కమలాపుర్ మండల పరిధిలోని శ్రీశైలం మల్లన్న ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లై , విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా రూ. 40వేల క్వింటాళ్ళ ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటి విలువ రూ.9.34కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అధికారులకు సిఫార్స్ చేసినట్లు వెల్లడిచారు. నల్గొండ యూనిట్ పరిధిలో చేపట్టిన రూట్ చెకింగ్ లో 13 వాహనాల పై కేసు నమోదు చేసి రూ.3 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ యూనిట్ పరిధిలో రూ.70వేల విలువైన 30క్విటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Next Story