Electricity:తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు

by Prasad Jukanti |
Electricity:తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం (peaks Power load) నమోదైంది. ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో అత్యధిక విద్యుత్ వినియోగం 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదైంది. అయితే ఈ సారి మాత్రం ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్‌కు చేరడంతో సమ్మర్‌లో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ డిమాండ్‌ను తట్టుకునేలా ఎస్పీడీసీఎల్(SPDCL), ఎన్పీడీసీఎల్ (NPDCL) సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గడిచిన 13 నెలల వ్యవధిలో రూ.1,000 కోట్ల ఆదా జరిగినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Next Story