- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు.. సీఎం రేవంత్ రెడ్డి గుడ్‍న్యూస్
కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏళ్లు నిండి కాలేజీ చదువుతు విద్యార్థినులకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలుపై సంచలన ప్రకటన చేశారు. కాలేజీ చదువుతున్న విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం కుదరకపోవచ్చని కానీ త్వరలోనే వాటిని అందజేసే ఆలోచనతో ఉన్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థానాలకు చేరాలని ఆంకాంక్షించారు. ఇవాళ హైదరాబాద్‍లోని ప్రజా భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడారు.మహిళలకు ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలనేదే మా లక్ష్యం అని కీలకమైన శాఖలన్నీ మహిళా అధికారులు సమర్థవంతంగా నడిపిస్తున్నారని, ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు.
దేశంలో వివక్ష ఉంది
ఈ దేశంలో కులాల మధ్యే కాదు స్త్రీ, పురుషుల మధ్య రకరకాల వివక్ష ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వివక్ష ఉందని కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు, ముందుకు వెళ్లేవారికి అవకాశం ఉందన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఏదేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందని మన దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, ఫలితం లేదన్నారు. ఇంటి, ఆఫీస్ పనుల్లో చులకన చూసే మాటలు వస్తుంటాయన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే మహిళల టాలెంట్ ను గుర్తించి వారిని ప్రోత్సహించే బాధ్యత ఆయా సంస్థలపై ఉందన్నారు. వ్యక్తులుగా కొన్ని మనం చేయలేం. కానీ వ్యవస్థగా ఆ టాలెంట్‍ను గుర్తించి అవకాశం కల్పించవచ్చన్నారు.
త్వరలో మహిళలకు ఏసీ బస్సుల్లో ప్రయాణం:
కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉండే అమెజాన్‍లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను అమెజాన్ లో ప్రపంచానికి విక్రయించేలా అవకాశం కల్పించామన్నారు. ఇందిరా బజార్ ద్వారా లోకల్ టాలెంట్‍ను గ్లోబల్ టాలెంట్‍గా తీర్చిదిద్దేందుకు అవకాశం కల్పించామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారని వారిని చిన్నచూపు చూస్తారని వారి చేతనే బస్సులకు యజమానులను చేసి వ్యాపారాల్లో రాణించేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం స్వయం సహాయం సంఘాలకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రపంచ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్నారు. రెడ్, ఆరెంజ్ పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించాల్సి ఉందన్నారు. 2026 డిసెంబర్ నాటికి నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడుస్తాయన్నారు. ఇప్పటికే 500 బస్సులు వచ్చాయని మరో 2300 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. వచ్చే డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‍లో ఒక్క డీజిల్ బస్సు లేకుండా అన్నీ ఈవీ ఏసీ బస్సులు వస్తాయన్నారు. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ గా మార్చుతామన్నారు.
మధుపార్క్ అపార్టుమెంట్ వాసులకు ప్రత్యామ్నాయం చూపుతాం:
మధుపార్క్ అపార్టుమెంట్ విషయంలో వస్తున్న ఆరోపణలపై సీఎం స్పందించారు. ఈ అపార్ట్ మెంట్ ఈసా నది ఒడ్డున ఉందని ఇది నాలా అని చూపించి అక్కడ బిల్డర్ అపార్ట్ మెంట్ కట్టారు. 2012 చట్టం ప్రకారం మూసీ, ఈసా నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్ లో ఎవ్వరూ ఏమి కట్టవద్దని, ఏదైనా కట్టినా వాటిని తొలగించాలని ఎన్జీటీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఈ 7 ఎకరాల్లో ఉన్న ఈ అపార్ట్ మెంట్ కు బదులుగా పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలం కేటాయించి ఇప్పుడు ఎంత పరిమాణంలో నిర్మాణం జరిగిందో అంతటి నిర్మాణానికి అవసరం అయ్యే నిధులను బ్యాంకులో నిధులు డిపాజిట్ చేస్తామన్నారు. నష్టపరిహారం తీసుకుని వేరే చోట కొనుగోలు చేసుకుంటామంటే అది మీ ఇష్టం. మీరు ఒక అసోసియేషన్ గా ఏర్పడాలని అధికారులతో నేను చెప్పి పంపించాను. కానీ అది వారికి ఎంత మేరకు చేరిందో తనకు తెలియదు. ఇంతలో ఇది అది రాజకీయ రంగు అద్దుకుంది. రాజకీయనాయుకులు అక్కడికి వచ్చి సానుభూతి చూపుతున్నారు. సానుభూతితో ఈ సమస్యకు పరిష్కారం కాదని ఇలాంటి అంశాల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. బఫర్ జోన్ల పరిధిలో 50 మీటర్ల లోపల ఉంటే ఇళ్లకు విలువ ఉండదన్నారు.






