Jubilee Hills By-Election: 30 మంది నామినేషన్లు తిరస్కరణ..

by Gantepaka Srikanth |

30 మంది నామినేషన్లు తిరస్కరణ..

Jubilee Hills By-Election: 30 మంది నామినేషన్లు తిరస్కరణ..
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌(Jubilee Hills By-Election Polling)పై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్(RV Karnan) స్పష్టత ఇచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక పోలింగ్‌కు ఈవీఎంలు(EVM) ఉపయోగిస్తామని చెప్పారు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఉండదు అని స్పష్టం చేశారు. 64 మంది అభ్యర్థులు దాటితే M3 ఈవీఎంలు ఉపయోగిస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇప్పటివరకు 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సరైన ఫార్మాట్‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో 30 మంది అభ్యర్థులకు చెందిన 59 సెట్ల నామినేషన్లు అధికారులు తిరస్కరించినట్లు తెలిపారు. మరో 39 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్లు ఆమోదించినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు సమయం ఉన్నందున తుది బరిలో ఎంత మంది నిలుస్తారనేది తెలవనుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనుంది.

Next Story