- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు.. సాయంత్రం ముగియనున్న ఎన్నికల కోడ్
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని ఈసీ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,727 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, వాటిలో కొన్ని ఏకగ్రీవమయ్యాయి, మరికొన్ని చోట్ల ఎన్నికలు జరగలేదు.
మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు సుమారు 6,794 సర్పంచ్ స్థానాలు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు సుమారు 3,503 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ మద్దతు అభ్యర్థులు సుమారు 697 స్థానాల్లో విజయం సాధించారు. కొన్ని చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.






