- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Local body elections: కులగణనకు కేంద్రం రెడీ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితేంటి?
కులగణనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితేంటి అనే చర్చ జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే జనాభా లెక్కలతో పాటే కులగణన (Caste Census) చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదం తెలపడం తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ డిస్కషన్ కు దారి తీస్తోంది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించి ఆ వివరాల ఆధారంగా స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ క్రమంలో త్వరలో తాము కులగణన చేపడతామని కేంద్రం ముందుకు రావడంతో ఈ ఎఫెక్టు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ఉండబోతున్అన్నదా అనేది సందేహంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana, Local Body Elections) వెళ్తామని రాష్ట్రం ప్రభుత్వంలోని కీలక పెద్దలు ఇప్పటికే పదే పదే చెబుతున్నారు. మరో వైపు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఇన్నాళ్లు బీసీ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఇంతలో కులగణనపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోగా స్థానిక ఎన్నికల పరిస్థితి ఏంటి అనే సందేహంగా మారింది. కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం రాబోయే జనాభా లెక్కలు ఎప్పుడు నిర్వహిస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటికే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఏడాదికి పైనే కావొస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్ణయంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠగా మారింది.
తెలంగాణ కుల సర్వే పరిస్థితేంటి?:
ఇవాళ కేబినెట్ ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. జనాభా లెక్కలు కేంద్రానికి సంబంధించిన అంశం అని కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వేలు చేయించిందని ఆరోపించారు. ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న సర్వేల్లో పారదర్శకంగా లేదని, కాంగ్రెస్ చేపట్టిన ఈ సర్వేలతో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అశ్వనీ వైష్ణవ్ ధ్వజమెత్తారు 1931లో చివరిసారిగా కులగణన జరిగిందని, అప్పటి నుంచి ఎవరూ కులగణన చేయలేదన్నారు. గతంలో కులగణనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కులసర్వేలు అన్ని పారదర్శకంగా లేవని కేంద్ర మంత్రి ఆరోపించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కుల సర్వే పరిస్థితి ఏంటి అనేది కూడా సందేహంగా మారింది.






