పేదరికాన్ని అంతం చేసే ఆయుధం చదువు ఒక్కటే : సీతక్క

by Muthe.Rajitha |

చదువు విలువపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

పేదరికాన్ని అంతం చేసే ఆయుధం చదువు ఒక్కటే : సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : చదువు విలువపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పలు కీలక వ్యాఖ్యలు చేసారు. పేదరికాన్ని అంతం చేసే ఆయుధం చదువు ఒక్కటేనని వెల్లడించారు. శనివారం ములుగు జిల్లాలోని కొత్తగూడ మండలం మొండ్రాయి గూడెంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అన్ని సౌకర్యాలతో, ఆహ్లాద వాతావరణంలో ప్రయివేట్ ప్లే స్కూల్ కు ధీటుగా ఈ అంగన్వాడీ భవనాన్ని నిర్మించడం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... పేదరికాన్ని జయించాలంటే చదువే సరైన ఆయుధం అని అన్నారు.

రేపటి భావిపౌరుల అందమైన భవిష్యత్తును నిర్మించాలంటే పాఠశాలలే కీలక ఆధారం అన్నారు. పాఠశాల వాతారవరణం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందని, ఆలోచించే సామర్థ్యం అలవడుతుందని సీతక్క అన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story