హాక్‌బ్రిడ్జ్ హెవిటిక్, ఈసన్ కంపెనీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

by Naga Rani Yarlagadda |

విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హాక్‌బ్రిడ్జ్ హెవిటిక్, ఈసన్ లిమిటెడ్‌కు చెందిన రూ.111.57 కోట్ల విలువైన..

హాక్‌బ్రిడ్జ్ హెవిటిక్, ఈసన్ కంపెనీల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
X
  • రూ.111.57కోట్ల స్థిరాస్తుల తాత్కలికంగా జప్తు
  • విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు కేసులో జప్తు

దిశ, తెలంగాణ బ్యూరో : విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో హాక్‌బ్రిడ్జ్ హెవిటిక్, ఈసన్ లిమిటెడ్‌కు చెందిన రూ.111.57 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ స్ట్రెస్డ్అసెట్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్ ఫిర్యాదు మేరకు సీబీఐ 2023లో నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌, విక్టరీ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ స్విచ్‌గేర్స్ లిమిటెడ్ ( వీటీఎస్ఎల్) సంస్థలకు అనుబంధంగా హాక్‌బ్రిడ్జ్ హెవిటిక్, ఈసన్ లిమిటెడ్‌ సంస్థ్ వ్యవహరించినట్లు వెల్లడించారు. వీటీఎస్ఎల్, డైరెక్టర్లు మహీంద్రా కుమార్, మనోజ్ కుమార్, వెంకటప్ప నాయుడు ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఎస్ బీఐ నుంచి రూ.136.50 కోట్ల రుణాలను తప్పుడు పత్రాలు సమర్పించి తీసుకున్నట్లు, వాటిని షెల్ కంపెనీలకు మళ్ళించడం ద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిలినట్లు పేర్కొన్నారు. ఎస్‌బీఐకి మొత్తం నష్టం రూ. 189.04 కోట్లు (వడ్డీతో సహా)వాటిల్లిందని పేర్కొన్నారు. విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులు అందుబాటులో లేకపోవడంతో అనుబంధంగా వ్యవహరించిన సంస్థల ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపారు.

Next Story