సర్పంచ్‌ ఎన్నికల బ్యాలెట్‌లో NOTA గుర్తు.. కలెక్టర్లకు ఈసీ కీలక ఆదేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-28 12:05:25  IST  )

బ్యాలెట్ బాక్స్‌లో NOTA గుర్తు.. కలెక్టర్లకు ఈసీ కీలక ఆదేశం

సర్పంచ్‌ ఎన్నికల బ్యాలెట్‌లో NOTA గుర్తు.. కలెక్టర్లకు ఈసీ కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు(Telangana Sarpanch Elections) ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. బ్యాలెట్ చివరి గుర్తు తర్వాత నోటా(NOTA) గుర్తు ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఈసీ నోటిఫికేషన్ పంపింది. కాగా, ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ఘట్టం మొదలైంది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్రులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయిలోనే తమ అనుచరులతో మంతనాలు జరుపుతూ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. చివరి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 22 నెలల తర్వాత రావడంతో ఈ దఫా యువతరం నేతలు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని చోట తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించుతున్నారు. ఈ ఎన్నికలకు నేడు, రేపు ఎక్కువగా నామినేషన్లు పడే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.

Next Story