- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. డీజీపీకి EBC సంక్షేమ సంఘం ఫిర్యాదు
మాకూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టం కావాలని ఈబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కులాల అభివృద్ధికి కృషి పేరుతో అగ్రకులాలకు చెందిన ప్రజలను, నాయకులను ద్వేషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈబీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో 18 కుల సంఘాలు డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశాయి. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ విద్వేషాలను రెచ్చగొట్టి, ఘర్షణలు చెలరేగేలా కొందరు వ్యవహరాస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, మానసిక వేదన కలిగిస్తున్నాయని ఇలాంటి వాటి వల్ల కుల విద్వేషాలు రేగి ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని అందువల్ల ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీస్ డిపార్ట్ మెట్‍లో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. బీసీ రిజర్వేషన్‍పై కోర్ట్ తీర్పు తరువాత కొంత మంది అగ్రకులాలు పూర్తిగా రిజర్వరేషన్లకు వ్యతిరేకం అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. అగ్రకులాల మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అనుకూల వ్యక్తులపై భౌతిక దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని తాము ఆత్మగరౌవంతో జీవించే హక్కుని కాపాడాలని కోరారు. అలాగే ఎస్సీ ఎస్టీలను తిడితే అట్రాసిటీ కేసు పెట్టినట్టే మమ్మల్ని తిట్టినా అలాంటి కేసులు పెట్టాలని ఈ సందర్భంగా అగ్రకుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈబీసీ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.






