- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు: ఈటల రాజేందర్ విమర్శలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ పై ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ( ఈవెంట్ మేనేజర్‍లా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్ బాల్ (Messi Football Event) ఆడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ Eatela Rajender) విమర్శించారు. సింగరేణి కార్మికులకు ఇండ్లు బాగుచేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ సింగరేణి డబ్బులు రూ.100 కోట్లు పెట్టి ఫుట్‍బాల్ మ్యాచ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. MCRHRD లో సీఎం ప్రాక్టీస్ చేయడానికి ఫుట్‍బాల్ కోర్టు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అప్పు తెచ్చుకుంటే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పు తెచ్చుకుంటే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కానీ పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ 50 శాతం సీట్లు కూడా గెలవలేదు:
స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులు ఉండవని స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు. నిధులు వస్తాయని అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిచారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. ఏ ఊరికి వెళ్లిన భర్తకు పెన్షన్ ఉంటే ఆయన చనిపోతేనే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మీద పడిన కూడా పెన్షన్ రావడం లేదన్నారు. భర్తలు చనిపోయిన వారికి కూడా పెన్షన్ రావడం లేదు. అప్లికేషన్ పెట్టుకున్న పెండింగ్‍లోనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లకు ఇస్తామన్న సబ్సిడీ డబ్బులు కూడా జమ చేయడం లేదన్నారు. వారు ఇచ్చిన హామీలు.. రైతుబంధు, మహిళలకు 2500, యువతకు నాలుగు వేలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మాటల గారడితో మీడియాను మేనేజ్ చేసి ప్రజలను అదరగొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్‍లాగా నడిపిస్తుంది కానీ ప్రజా ప్రభుత్వం లాగా కొనసాగడం లేదన్నారు. సర్పంచ్‍లకు వార్డు మెంబర్లకు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వారి ఖాతాలో వేసుకోవడం కాదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు.
కవిత ఆరోపణలపై విచారణ చేపట్టాలి:
బీఆర్ఎస్ వేల కోట్ల కుంభకోణం చేసిందని కేసీఆర్ కూతురు కవిత పదేపదే మాట్లాడుతున్నారు. కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూడా ఇలానే అదరగొట్టి మీడియాను మేనేజ్ చేసి అహంకారంతో వ్యవహరిస్తే ఏం జరిగిందో చూశామని.. ప్రజలు సమయం సందర్భం వచ్చినప్పుడు విజ్ఞత ప్రదర్శిస్తారన్నారు. రెండవ మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్యారెక్టర్ కమిట్మెంట్ ఉన్న వారిని మీతో ఉండి పని చేసే వారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నా సొంత ఊర్లో ఓడిపోయాననే వార్తా కోసం తాపత్రయపడ్డారు:
ఎవరెవరు కలిసి ఖర్చు పెట్టారు ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని లోతులకు పోలేను కానీ.. కమలాపూర్‍లో సతీష్ ను ఓడిస్తే.. ఈటల రాజేందర్ ని ఒడిగొట్టినట్టే.. సొంత ఊరులో ఓడిపోయాడు అనే వార్త రాయించవచ్చు అని తాపత్రయ పడ్డారు.. కానీ దానిని తొక్కిపడేసి కమలాపూర్ ప్రజలు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించి గరీబ్ బిడ్డను గెలిపించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. గూడూరులో కూడా చాలా గొప్ప మెజారిటీతో గెలిపించారని చెప్పారు. కొంతమంది పిచ్చి కుక్కల్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ కేసీఆర్ రాష్ట్రం అంతటా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ వేరే నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు. స్థానికంగా ఉన్న నాయకుడు పట్టి అభివృద్ధి ఉంటుందని తెలుసుకోవాలన్నారు. మావాళ్ళు గొప్పగా కొట్లాడారు.. నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చారు.
వీణవంక హుజురాబాద్ జమ్మికుంట ఇల్లందకుంట నాలుగు మండలాలకు 17వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదేవిధంగా కష్టపడి పని చేసి గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు తమ పార్టీ తరఫునే గెలిచినట్లుగా చెబితే రూ. 5-10 లక్షలు ఇస్తామనే చిల్లర ప్రయత్నం కొనసాగుతోందని విమర్శించారు.
సోషల్ మీడియా పోస్టులపై స్పందన:
నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి అన్నారు. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి.ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఆ పోస్టుల గురించి సమయం వచ్చినప్పుడు పార్టీనే తేలుస్తుందన్నారు.






