- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Eatala Rajender: అలాంటి వారు పార్టీ పదవులకు రాజీనామా చేయండి.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాబోయేది బీజేపీ (BJP) ప్రభుత్వమేనని దానిని అందిపుచ్చుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) పిలుపునిచ్చారు. పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం పనిచేసేటప్పడు కూడా ఉండాలన్నారు. పని విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డివిజన్ అధ్యక్షులైనా ఎవరైనా 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. అలా లేనివారు రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా (Medchal Urban District) విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుల కోసం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొన్నదన్నారు. భవిష్యత్తులో పార్టీ మరింత బలంగా ఉంటుంది అనటానికి ఇది సంకేతం అన్నారు. పార్టీ అధ్యక్షులు అందరూ పార్టీకి మచ్చ తేకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని సూచించారు.
కేసీఆర్ కు పదేళ్లు పడితే రేవంత్ రెడ్డికి పది నెలలే:
కేసీఆర్ (KCR) ప్రభుత్వం పతనం కావడానికి పదేళ్లు పడితే రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి పది నెలల సమయమే పట్టిందని ఈటల విమమర్శించారు. ఈ పది నెలలుగా బీజేపీ పార్టీ అనేక సమస్యలపై కొట్లాడిందని హైడ్రా, దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా హెచ్ సీయూ భూములు ఇలా అన్ని సమస్యలపై పోరాడుతున్నది బీజేపీనేనని చెప్పారు. గుడికి కూడా నోటీస్ అంటించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని విమర్శించారు. 14 దేవాలయం మీద దాడి జరిగితే అందులో మన దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి కూడా ఉంది. హెచ్ సీయూ భూముల కోసం పార్టీ అంతా కదిలిందని తాత జాగీరు అన్నట్లుగా విర్రవీగిన ప్రభుత్వానికి కోర్టు దిమ్మ తిరిగే నిర్ణయం చెప్పిందన్నారు.
అలా చేస్తేనే స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం:
బీజేపీ ఎంపీలు కేంద్ర వద్ద నుంచి తీసుకువస్తున్న నిధులు, చేయిస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ బాధ్యత పార్టీ శ్రేణులందరిపై ఉందని అలా చేస్తేనే మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలవగలం అన్నారు. అతివేగంగా నిధులు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్న నియోజకవర్గం మల్కాజ్గిరి అని చెప్పారు. రాజకీయ పార్టీలకు అంతిమ గీటురాయి గెలుపు ఓటములేనని చెప్పారు. బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే పార్టీ అని అనేక మంది పార్టీ మేలు కోరేవారు, మద్దతు తెలిపే సంఘాలు ఉంటాయి. మన పార్టీలో ఎవరు పోటీచేసినా వ్యక్తులతో సంబంధం లేకుండా గెలుపు కోసం ప్రయత్నం చేస్తారన్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా అనేక మంది 30-40 ఏళ్లుగా పడుతున్న భూసమస్యలకు పరిష్కారం దక్కనుందని చెప్పారు. పడుతున్న బాధలకు పరిష్కారం ఇవ్వనుంది.






