సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం.. రథయాత్ర కార్యక్రమంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ వచ్చిన తర్వాత బరితెగించిన సంఘటనలు జరుగుతున్నాయని, చట్టమంటే భయం లేదు అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యనించారు.

సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం.. రథయాత్ర కార్యక్రమంలో ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వచ్చిన తర్వాత బరితెగించిన సంఘటనలు జరుగుతున్నాయని, చట్టమంటే భయం లేదు అని ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) వ్యాఖ్యనించారు. గురువారం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన ఆయన "సామాజిక తెలంగాణ చైతన్య రథయాత్ర" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగు తరాల ఉద్యమం జరిగిందని గుర్తుకు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం జరగాలని చాలామంది మేధావులు అన్నారని వివరించారు. తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదన్నారు. దోపిడీ చేసుకున్న వారికి మాత్రం దోచుకున్నంత చెందుతూ ఉందన్నారు.

తెలంగాణలో సామాజిక చైతన్యాన్ని నింపాలనే లక్ష్యంతో సామాజిక తెలంగాణ రథయాత్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ పల్లెల్లో మా జాతికి అన్యాయం జరుగుతుందని ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మొన్న బంద్‌కు పిలిపిస్తే ప్రజలు ఎలా స్పందించారు మనం చూశామని చెప్పారు. వీరి శక్తి చిన్నగా కనిపించవచ్చు కానీ.. పిడికెడు మందే ఉండవచ్చు.. చిన్నగనే కనిపిస్తూ ఉండవచ్చు..కానీ ఏదో ఒక రోజు తెలంగాణ ఎలా సాధ్యమైందో సామాజిక తెలంగాణ, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని ఆకాంక్షించారు. దీనిని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని, ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ఇది జరిగి తీరుతుందని చెప్పారు.

ఈ గర్భంలో పుట్టిన సామాజిక తెలంగాణ విజయ తీరాలను ముద్దాడి తీరుతుందని విశ్వాసం మాకు ఉందన్నారు. రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ప్రజల అంతరంగానికి నడుచుకునే రాజకీయ నాయకులు ఉన్నారని అన్నారు. ‘వీరు చేస్తున్న రథయాత్రకు నేను సంపూర్ణంగా మద్దతిస్తున్న, వారి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను, వారి యాత్రను ప్రజలు మద్దతు తెలపాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ లోకల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, RLD జాతీయ మహిళా అధ్యక్షురాలు ఇందిరాకు అభినందనలు తెలిపారు.

Next Story