- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భూకంపం... రెండు జిల్లాలలో కంపించిన భూమి
తెలంగాణలోని రెండు జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి భూమి కంపించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని రెండు జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.9గా గుర్తించారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం మర్తిడి గ్రామంలో 3సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కిందపడ్డాయి.
గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూమి కంపించడంలో లేచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భూకంపం వల్ల వస్తువులు కదిలిన సీసీ టీవీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం సైతం రాష్ట్రంలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఆ సమయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు.






