Eagle Team Raids: న్యూ ఇయర్ వేడుకల్లో ఈగల్ టీమ్ పంజా.. 60 పబ్బుల్లో రెయిడ్స్

by Prasad Jukanti |

డిసెంబర్ 31 అర్ధరాత్రి నగరంలో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించింది.

Eagle Team Raids: న్యూ ఇయర్ వేడుకల్లో ఈగల్ టీమ్ పంజా.. 60 పబ్బుల్లో రెయిడ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకలపై ఈగల్ టీమ్ పంజా విసిరింది. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ పబ్బుల్లో (Hyderabad Pubs) ఈగల్ బృందాలు (Eagle Team) సోదాలు నిర్వహించాయి. 60 పబ్స్ పై రెయిడ్స్ నిర్వహించగా ఇద్దరు డీజేలు సహా ముగ్గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. దీంతో జూబ్లీహిల్స్, నార్సింగ్ పీఎస్ లలో వారిపై కేసులు నమోదు చేశారు. కాగా డిసెంబర్ 31 రాత్రి డ్రగ్స్ లేకుండా వేడుకలు జరుపుకోవాలని ఈగల్ టీమ్ ముందుగానే నగర వాసులను హెచ్చరించింది. డ్రగ్స్ వినియోగిస్తే కటకటాల పాలు కావాల్సిందేనని హెచ్చరించారు. ముందుగా చెప్పినట్లుగానే పబ్ లపై కొరడా ఝుళిపించింది. డ్రగ్స్ వినియోగించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేసింది. డ్రగ్స్ వినియోగించిన వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? వారికున్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు.

Next Story