కేసీఆర్ పార్టీకి ప్రచారం చేస్తున్న ఏపీ కపుల్స్ !

by velandi.Saikiran |

ఏపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas), అలాగే ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ( Divvela Madhuri)

కేసీఆర్ పార్టీకి ప్రచారం చేస్తున్న ఏపీ కపుల్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas), అలాగే ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ( Divvela Madhuri) గురించి తెలియని వారు ఉండరు. తన భార్యను వదిలి, దివ్వెల మాధురితో ఉంటున్నారు వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ఇప్పటికే ఇద్దరు ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ కు వారసుడిని కూడా ఇస్తానని దివ్వెల మాధురి చాలా సార్లు ఇంటర్వ్యూలలో ప్రకటించింది.

అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఈ జంట చేస్తున్న హవా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ జంట రీల్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతలా ఈ కొత్త జంట పాపులర్ అయింది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా హైదరాబాద్ వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెల మాధురి... ఇద్దరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ( Green India Challenge ) పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితాసేనలో భాగంగా... మొక్కలు నాటారు దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గులాబీ పార్టీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ( KCR) పాలనలోనే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగించారు. ఇలాంటి... నేపథ్యంలోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది ఏపీ జంట. వీళ్లకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... కేసీఆర్ పార్టీ కోసం... దువ్వాడ అలాగే మాధురి ఇద్దరు ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Next Story