- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి కోసం వ్యవస్థ తాకట్టు.,. దుండిగల్‌లో రోడ్డు విస్తరణపై కలకలం.!
కబ్జాదారులు అనుకున్న పనిని సాదించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారిని నయానో, బయానో బెదిరించి అనుకున్న పని సాధిస్తున్నారు.
దిశ, దుండిగల్ : కబ్జాదారులు అనుకున్న పనిని సాదించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారిని నయానో, బయానో బెదిరించి అనుకున్న పని సాధిస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట సర్వే నంబర్ 166/3, 166/1 ప్రభుత్వ భూమిలో లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు యథేచ్ఛగా కొనసాగిస్తుండగా అధికార ఘనం కాంగ్రెస్ పార్టీ నాయకుడికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నిర్వహించాలంటే చుట్టూ పక్కల రైతులకు సమాచారం ఇవ్వాలన్న నిబంధనను అధికారులు తుంగలో తొక్కారా? అని, అధికారులు ఒక వ్యక్తి కోసం వ్యవస్థను తాకట్టు పెట్టినట్టుందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేట్ స్థలమైనా సర్వే నిర్వహించాలంటే ముందుకుగా చుట్టుపక్కల ఉన్న రైతులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణ కోసం జియో కోఆర్డినేట్స్ ఆధారంగా స్కెచ్ మ్యాప్ ఇవ్వాలంటూ దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ జూన్ 23న తహసీల్దార్ మతీన్‌కు లేఖ రాయడం, వెంటనే సర్వేయర్ హరికృష్ణ ద్వారా సర్వే నిర్వహించి మున్సిపల్ కమిషనర్‌కు సర్వే రిపోర్ట్ అందించడం చకాచకా జరిగిపోయాయి. సర్వే రిపోర్ట్ ఆధారంగా మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనులు దగ్గరుండి చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీఎంవో స్థాయిలో పైరవీలు..
బౌరంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సీఎంవో పేసిలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా సీఎంవో పేసికి తెలిసే జరుగుతుందా..? అధికార పార్టీ ముసుగులో సీఎం కార్యాలయానికి మచ్చతెచ్చే పనులు జరుగుతున్నాయా..? సీఎంకు అత్యంత సన్నిహితుడను అని చెప్పికునే ఓ వ్యక్తి అధికారులను మ్యానేజ్ చేస్తూ అక్రమాలకు ఒడిగడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆగమేఘాల మీద సర్వే..
ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేట్ స్థలమైనా సర్వే నిర్వహించాలంటే ముందుగా భూమిని కోల్పోతున్న రైతులకు, చుట్టుపక్కల రైతులకు నోటీసులు జారీ చేస్తూ కొంత గడువు ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ఆధారంగా సర్వే నిర్వహించి సర్వే రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. అందులో ఒక్క రైతు వ్యతిరేకించిన సర్వేను ఆపివేయాలన్న నిబంధన ఉంటుంది. రోడ్డు విస్తరణ కోసం సర్వే నిర్వహించి సర్వే రిపోర్ట్ ఇవ్వాలంటూ తహసీల్దార్‌కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాయడం, లేఖ వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగిపోయాయి. బౌరంపేట సర్వే నంబర్ 166/3 ఎక్స్ సర్వీస్ మెన్‌కు ప్రభుత్వ భూమిని కేటాయించగా లబ్ధిదారుడు ఎన్ఓసీ పొందినట్లు సమాచారం. భూమి యజమాని శేషారెడ్డికి కనీస సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూమిని వదిలే ప్రసక్తే లేదు. - శేషారెడ్డి, భూ బాధితుడు
భూములు సర్వే చేయాలంటే రైతులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కు కేటాయించిన ల్యాండ్‌లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించి రోడ్డు విస్తరణ పనులు చెపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భూమిని వదిలే ప్రసక్తేలేదు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. త్వరలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడిస్తాం.
సర్వే ఆధారంగా చర్యలు..- ఆర్డీఓ శ్యాంప్రకాష్
సర్వే నంబర్ 166/3 ఎక్స్ సర్వీస్ మెన్‌కు కేటాయించాం. సర్వే నంబర్ 166/1 అసైన్డ్ భూమి రైతులకు నోటీసులు జారీ చేశాం. విచారణ అనంతరం కబ్జాదారులపై చర్యలు ఉంటాయి.








