త్వరలోనే కేసీఆర్ మటన్ క్యాంటీన్స్ ప్రారంభం

by Dishafeatures2 |
త్వరలోనే కేసీఆర్ మటన్ క్యాంటీన్స్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాంసం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రాష్ట్ర రాజధానిలో కేసీఆర్ మటన్ క్యాంటీన్ ను ప్రారంభించబోతుంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులకు సైతం ఆర్థికంగా బలోపేతం చేయనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో త్వరలోనే మటన్ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకరాబోతున్నాయి. దీంతో తక్కువ ధరకు నాణ్యతతో కూడిన భోజనం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తులు భారీగా పెరిగాయి. మాంసం ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మటన్ క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ క్యాంటీన్లకు కేసీఆర్ మటన్ క్యాంటీన్లుగా నామకరణం చేశారు. దీంతో గొర్రెల మేకల పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలుత మాసబ్ ట్యాంకు సమీపంలోని షిప్ అండ్ గోట్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లకు ఫెడరేషన్ నుంచే మాంసంను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ మ‌ట‌న్ క్యాంటీన్లలో మ‌ట‌న్ బిర్యానీతో పాటు మటన్ కర్రీ, తలకాయ కూర, లివర్, బోటి కర్రీ, పాయ ను మొదటగా అందుబాటులోకి తేనున్నారు. మెనూ ధ‌ర‌లు ఖ‌రారు కాన‌ప్పటికీ, స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే మట‌న్ వంట‌కాల‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. తొలి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఫిష్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఫిష్ క్యాంటీన్లలో ప్రస్తుతం ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ, ఫిష్ ఫ్రై వంటి వెరైటీ వంట‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఆతరహాలోనే మటన్ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. చెంగిచెర్లలో ప్రభుత్వ స్లాటర్ హౌస్ నుంచి తాజా మాంసాన్ని క్యాంటీన్‌కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఏర్పాట్లు ముమ్మరం.. షీప్ అండ్ గోట్స్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్

మటన్ క్యాంటీన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశాం. పదిపదిహాను రోజుల్లో కేసీఆర్ మటన్ క్యాంటిన్ ప్రారంభిస్తాం. మటన్ బిర్యాని, వైట్ రైస్ విత్ మటన్ కర్రీ, వైట్ రైస్ విత్ తలకాయ కూర, లివర్, బోటి కర్రీలను మొదటగా ఏర్పాటు చేస్తున్నాం. చెంగిచెర్లలో ప్రభుత్వ స్లాటర్ హౌస్ నుంచి తాజా మాంసాన్ని క్యాంటీన్‌కు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఫెడరేషన్ నుంచి మటన్ సప్లయి చేయనున్నాం. దీంతో ఫెడరేషన్ బలోపేతం అవుతుంది. భవిష్యత్ లోనూ అన్ని జిల్లాల్లో మటన్ క్యాంటిన్లు ప్రారంభిస్తాం.


Next Story

Most Viewed