డ్రగ్స్ రహిత తెలంగాణే మా లక్ష్యం.. నార్కోటిక్ పోలీసులు

by Geesa Chandu |   (  Updated:2024-08-13 03:03:06  IST  )

డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ నార్కోటిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

డ్రగ్స్ రహిత తెలంగాణే మా లక్ష్యం.. నార్కోటిక్ పోలీసులు
X

దిశ: వెబ్ డెస్క్: డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ నార్కోటిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఅడిక్షన్ సెంటర్లను ఆక్టివ్ చేస్తున్నారు. వీటి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లను కూడా కేటాయించి, స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు పోలీసులు. రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు మరో సరికొత్త ప్రణాలికను సిద్ధం చేశారు నార్కోటిక్ డిపార్ట్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన డిఅడిక్షన్ సెంటర్లను మళ్ళీ యాక్టీవ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి 16 డిఅడిక్షన్ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టీవ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న మత్తు బాబుల సంఖ్య కారణంగా.. ఈ డిఅడిక్షన్ సెంటర్లను మళ్ళీ యాక్టివ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 కేంద్రాలలో బాధితులు చికిత్స పొందుతున్నారు. సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా డిఅడిక్షన్ సెంటర్లు పని చేయనున్నట్లు నార్కొటిక్ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ విశ్లేషణ ప్రకారం.. ఇప్పటివరకు అత్యధికంగా హన్మకొండ లో 92 మంది ఇంపేషంట్లు ఉన్నట్లు తెలిపారు. వీటిలో 15 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఈ సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా మేడ్చల్, అమంగల్, కొత్తూరు లో ఇవి యాక్టివ్ లో ఉన్నాయి. వీటిలో గడిచిన మూడు నెలల్లో 150 మంది ఈ కేంద్రాల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.ఇక ఆసుపత్రులలో బెడ్ల విషయానికి వస్తే..గాంధీలో 15 బెడ్స్, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో 15 బెడ్లు, వీటితో పాటు మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10 బెడ్ల చొప్పున బాధితుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ANM లు, పంచాయతీ ఆఫీసర్లు, వార్డు మెంబర్లను మత్తుకు బానిసగా మారిన యువతను గుర్తించాలని ఆదేశించారు.

Next Story