- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Venkata Murali: భావితరాలకు నష్టం జరుగకుండా చూడాలి
ప్రకృతి సంపదను విధ్వంసం చేయకుండా ఇంజనీరింగ్ పనులు నిర్వహించినపుడు ప్రజలకు కూడా ప్రకృతి పర్యావరణాన్ని పంచినవారవుతారని డాక్టర్ కొలిగొట్ల వెంకట మురళి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి సంపదను విధ్వంసం చేయకుండా ఇంజనీరింగ్ పనులు నిర్వహించినపుడు ప్రజలకు కూడా ప్రకృతి పర్యావరణాన్ని పంచినవారవుతారని డాక్టర్ కొలిగొట్ల వెంకట మురళి అన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164 వ జయంతి ఉత్సవాలు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన మురళి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ పనుల్లో భాగంగా భారీ పరిశ్రమలు, భారీ ప్రాజక్టులతో వేలాది ఎకరాల ప్రక్రుతి సంపద ధ్వంసం కావడం భావితరాలకు నష్టం కాకుండా చూడాలని, తక్కువ స్థలంలో ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించడం వలన లాభం ఉంటుందన్నారు. వెంకటరమణ నో ఫుడ్ వేస్టేజ్ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తూ వృధాగ మిగిలిన ఆహారాన్ని హోటల్స్ రెస్టారెంట్స్, ఫంక్షన్స్ హాల్స్ నుండి సేకరిస్తూ రోజుకు పదిహేను వందల మంది అన్నార్తులకు పంచుతున్నారు.
ఈ సందర్బంగా కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర రావు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అతి పేదకుటుంబం నుండి వచ్చారని, ప్రపంచమే ఆశ్చర్యపడే సాగునీటి ప్రాజెక్టులు వందేళ్ల కిందటే కట్టడాన్ని చూసి, వారి ఇంజనీరింగ్ ప్రతిభకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని గౌరవిస్తూ “సర్” అనే గొప్ప బిరుదును ప్రసాదిస్తే, భారత ప్రభుత్వం అత్యున్నతమైన పౌర సత్కారం “భారతరత్న” బిరుదును మోక్షగుండo విశ్వేశ్వరయ్య గారికి ఇవ్వడం ప్రతి ఇంజనీర్ గర్వపడాలన్నారు. హైదరాబాద్‌కు వరద నియంత్రణ వ్యవస్థ లో భాగంగా 1909 లో చేపట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలతో, వారు చీఫ్ ఇంజనీరుగా నిర్మించిన కృష్ణరాజ సాగర ఆనకట్టతోపాటుగా పలు చిన్న పెద్దా ప్రాజక్టులతో ప్రజలు పుష్కలంగా ఆహారాన్ని పండిస్తున్నారని తెలిపారు.
మారుతున్నకాలానికి అనుగుణంగా ఇంజనీర్లు తమతెలివి తేటలను పెంచుకునే వీలుగా కలకత్తా హెడ్ క్వార్టర్ గా 1920 లోనే ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సంస్థ ఏర్పాటయిందని, దేశంలోనే అనేక ప్రాంతాల్లో వీటి శాఖలను ప్రారంభించగా, దేశంలోనే ఒకేఒక్క ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ అఫ్ ఇండియా 1981 లో హైదరాబాద్ లో ప్రారంభమైందని, గత నలభై నాలుగేళ్లుగా కొన్ని లక్షలాది మంది ఇన్ సర్వీస్ ఇంజనీరింగ్ స్టాఫ్ కు పవర్ అండ్ ఎనర్జీ, సివిల్ ట్రాన్స్ పోర్టేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర పన్నెండు డివిజన్లలో ప్రావీణ్యం కలిగిన ఫ్యాకల్టీలతో శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ జి. రామేశ్వర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ప్రాజెక్టు ఇంజనీర్ డి. శ్రీధర్ బాబు, పవర్ అండ్ ఎనర్జీ హెడ్ ఉబ్బ విద్యాసాగర్, ప్రొఫెసర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు కాలేజ్ ప్రాంగణంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డైరెక్టర్ తో సహా పలువురు ఇంజనీరులు, కాలేజ్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం చివరలో ఇంజనీర్స్ డే సందర్బంగా సర్క్యూలర్ ఎకానమీ సెల్ ను కాలేజ్ డైరెక్టర్ రామేశ్వర్ రావు అతిధుల సమక్షంలో ప్రారంభించారు.






