- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DOST : దోస్త్ గడువు రేపే లాస్ట్
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(TSCHE) డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ 2025(DOST 2025) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ రేపటితో ముగియనుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(TSCHE) డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ 2025(DOST 2025) ఫేజ్-1 రిజిస్ట్రేషన్ రేపటితో ముగియనుంది. మే 3న ప్రారంభమైన దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, మే 21న ముగియనుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో(ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, సతవాహన) డిగ్రీ కోర్సులైన BA, B.Com, B.Sc, BBA, BCA, BSW, D-Pharmacy మొదలైన వాటిలో ప్రవేశాల కోసం ఈ ప్రక్రియ నిర్వహించబడుతుంది. దీని ద్వారా సుమారు 4 లక్షల సీట్లు భర్తీ చేయబడనుండగా.. ఇప్పటి వరకు 64 వేల మంది రిజిష్ట్రేషన్ చేసుకున్నారు.
రిజిష్ట్రేషన్ చేసుకున్న వారికి ఈనెల 10న ప్రారంభం అయిన వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా మే 22న ముగియనుంది. అయితే రిజిష్ట్రేషన్ చేసుకున్న వారిలో సగం మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఎంచుకున్నట్టు సమాచారం. మే 29న సీట్ల కేటాయింపు జరగనుండగా.. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ గడువు తేదీ పెంచాలని విద్యార్థుల నుంచి భారీగా వినతులు వస్తున్నట్టు సమాచారం.






