వర్షాకాలంలో విద్యుత్ ఇబ్బందులు రానీయొద్దు : ఎస్​పీడీసీఎల్​ సీఎండీ ఆదేశాలు

by Muthe.Rajitha |

వచ్చే వర్షాకాలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో విద్యుత్ ఇబ్బందులు రానీయొద్దు : ఎస్​పీడీసీఎల్​ సీఎండీ ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే వర్షాకాలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్ లోని ప్రధాన కార్యలయం నుండి చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్ల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భముగా సీఎండీ మాట్లాడుతూ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు తమ పరిధిలోని ఫీడర్లలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, వారానికొకసారి సంబంధిత అధికారులతో సమీక్ష చేయాలని సూచించారు. అత్యధికంగా అంతరాయాలు నమోదైన ఫీడర్ల పై ప్రత్యేక

దృష్టి సారించి లైన్ల, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, ఏబీ స్విచ్ లను తనిఖీలు చేపట్టి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఫీడర్ల అంతరాయాలకు గల కారణాలను విశ్లేషించగా ఎక్కువ శాతం చెట్ల కొమ్మలు విద్యుత్ తీగల పై పడటం, తాకడం మూలంగానే ట్రిప్ అవుతున్నాయని గుర్తించామన్నారు. కావున, క్షేత్ర స్థాయి సిబ్బంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో విధిగా పెట్రోలింగ్ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వర్షాలు కురిసేటప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికల సమయంలో సిబ్బంది తమ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వినియోగదారుల ఫిర్యాదులపై తక్షణంగా స్పందించి సమస్య పరిష్కరించాలని, ఎఫ్​ఓసీ పరిధిలో ఉండే ఆటోలకు జీపీఎస్​సాంకేతికతను అమర్చడం జరిగిందని, ఈ సదుపాయం వలన ఫిర్యాదిదారుడి ప్రాంగణానికి త్వరితగతిన చేరే అవకాశం ఉంటుందన్నారు.

గతంలో 11 కేవీ నెట్​వర్క్​ పై నిర్వహించిన టీజీ ఏఐఎంఎస్​ సర్వే సత్పలితాలను ఇస్తోందన్నారు. ఈ సర్వే ద్వారా విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు, ఇతర నెట్​వర్క్​మాపింగ్ విజయవంతంగా పూర్తి అయిందన్నారు. దీనిని 33 కేవీ నెట్వర్క్ , యల్​టీ స్థాయిలో కూడా సర్వే చేపట్టాలని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎండీ తో పాటు, సంస్థ ఇంచార్జి డైరెక్టర్ లు డా. నర్శింహులు, కే సాయి బాబా, చీఫ్ ఇంజినీర్లు చక్రపాణి, పాండ్య, కామేష్, బాల స్వామి సుపేరింటేడింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

Next Story