- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి రైతుల గోస ప్రభుత్వాలకు పట్టదా..?
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు గోసపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని,

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు గోసపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, ఇక్కడున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా విఫలమయ్యారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డులో రైతులతో ఆమె మాట్లాడారు.. వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని ఇటు మద్దతు ధర కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆమెకు వెలిబుచ్చారు. పత్తిలో తేమశాతం పేరుతో కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.
20 శాతం తేమ మించి ఉన్న కొనుగోలు చేసేందుకు సీసీఐ ముందుకు రావాలన్నారు. ఇక్కడ బిజెపి ఎంపీ, ఎమ్మెల్యేలున్న కనీసం కేంద్ర మంత్రులతో మాట్లాడి రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికలు పక్కనపెట్టి రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో ఫోన్ లో మాట్లాడి..పత్తిలో తేమ శాతం 20కి మించి ఉన్నా కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ చారి,లలిత యాదవ్, వేణుగోపాల్ యాదవ్, అసపు ప్రమోద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
READ MORE ....
Minister Thummala: పత్తి కొనుగోలు నిబంధనలు సడలించాలి.. కేంద్ర మంత్రికి తుమ్మల లేఖ






