- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. హైదరాబాద్‌లో కుక్కల రక్తపు దందా.. రూ. 25 వేల వరకు వసూలు!
హైదరాబాద్‌లో కుక్కల రక్తపు వ్యాపారం వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కలకు ఫేక్ రిపోర్టులు ఇచ్చి వేల రూపాయలు వసూలు చేస్తున్న ఆసుపత్రి బాగోతం.

దిశ, డైనమిక్ బ్యూరో: డబ్బుల కోసం ఎలాంటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొంత మంది నీచులు. రాష్ట్రంలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం మరువక ముందే తాజాగా హైదరాబాద్‍లో కుక్కల రక్తంతో దందా వెలుగుచూడటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వీధి కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని అవసరం లేకపోయినా పెంపుడు కుక్కలకు ఎక్కిస్తున్న వైనం బట్టబయలైంది. కుక్కలను పెంచుకుంటున్న వారే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాపై కొంత మంది జంతుప్రేమికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. షేక్‍పేటలోని ఓ ప్రైవేట్ పశువైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చే పెంపుడు కుక్కలకు అక్కడి వైద్యులు బలవంతంగా రక్తం ఎక్కిస్తున్నారు. అవసరం లేక పోయిన పెంపుడు కుక్కలకు రక్తహీనత ఉన్నట్లు ఫేక్ రిపోర్టులు...రక్తం ఎక్కిద్దామని బలవంతం చేస్తూ రూ. 18 వేల నుంచి 25 వేల వరకు ఒక్క రక్తం ప్యాకెంట్ ఎక్కిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.
వీధి కుక్కల నుంచి రక్తం సేకరణ:
పెంపుడు కుక్కలకు ఎక్కించేందుకు అవసరమైన రక్తాన్ని వీధి కుక్కల నుంచి సేకరిస్తుండటం విస్మయానికి గురి చేస్తోంది. చికిత్స, సంరక్షణ పేరుతో వీధికుక్కలను సదరు సిబ్బంది ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడే వాటిని పెంచుతున్నారు. వాటి నుంచి ప్యాకెట్ల రూపంలో సేకరించిన రక్తాన్ని ఆసుపత్రికి వచ్చే పెంపుడు కుక్కలకు ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో అప్పటి వరకు చలాకీగా ఉండే వీధి కుక్కలు రక్తహీనతతో మృత్యుభారిన పడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది అడ్డదారులు తొక్కడంపైఅనుమానం కలిగిన జంతు ప్రేమికులు విషయం అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఈ తతంగం బయటపడింది.
ఖంగుతినిపించిన గొర్రె,మెకల రక్తం మాఫియా:
కుక్క రక్తం దందా ఇలా ఉంటే ఈ ఏడాది ఆరంభంలో గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం రాష్ట్రంలో ఒక్కసారిగా అందరిలో అలజడి రేపింది. బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠా దొరికిపోయింది. సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అధికారుల సూచనలతో హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడ ప్రాంతంలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో ఆకస్మిక సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో రక్త నిల్వలు బయటపడ్డాయి. సుమారు 1000 లీటర్లకు పైగా గొర్రె, మేక రక్తంతో నిండిన ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ పరిణామంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తం నిల్వ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నదానిపై అనుమానాలు వ్యక్తం కాగా ఈ రక్తం ఉపయోగించి క్లినికల్ ట్రయల్స్ జరిపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో మొన్న గొర్రెలు, మేకల రక్తం వ్యవహారం వెలుగులోకి రాగ ఇప్పుడు కుక్కల రక్తం దందా బహిర్గతం కావడంతో నగర వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.






