నా మాటలను అపార్థం చేసుకోవద్దు.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఇప్ప పువ్వు సారాపై అసెంబ్లీలో జరిగిన రచ్చపై ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కీలక వివరణ ఇచ్చారు.

నా మాటలను అపార్థం చేసుకోవద్దు.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్ప పువ్వు సారా చర్చ సందర్భంగా తాను మాట్లాడిన మాటలను ఎవరూ అపార్థం చేసుకోవద్దని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ప్రభుత్వం ఇప్ప సారాను అందుబాటులోకి తెస్తే, దానికి ‘ఇందిరమ్మ’ పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఒకవేళ తాను మాట్లాడిన మాటలు తప్పనిపిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పేర్కొన్నారు. తన మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలుగజేసుకుని.. రాకేశ్ రెడ్డి ఎక్కడా అసభ్య పదజాలం వాడలేదని స్పష్టం చేశారు. మంత్రులు అనవసరంగా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాకేశ్ రెడ్డి మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి ధ్వజమెత్తారు.

Next Story