- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రేవంత్.. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం.. సీఎంకు డీకే అరుణ సవాల్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ్ మరో సవాల్ విసిరారు. బుధవారం ఆమె మీడియతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి.. ఇద్దరం కలిసి జిల్లాలో ఎక్కడికైనా వెళ్దామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి జిల్లాలో ఏ ప్రాజెక్టు కోసం పోరాడారు..? ఎక్కడ ఉద్యమం చేశారని ప్రశ్నించారు. కొడంగల్‌లో చీకట్లో తిరుగుతున్నామని అంటున్నారు.. ఇక నుండి చీకట్లో కాదు.. పట్టపగలే సీఎం సొంత ఇలాకాలో తిరుగుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరుగుతానని డీకే అరుణ ఛాలెంజ్ చేశారు. డీకే అరుణ, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది.