అరూరి ఎంపీగా గెలిస్తే అరాచకాలకు అడ్డు కట్ట ఉండదు: కడియం కావ్య

by Disha Web Desk 23 |
అరూరి ఎంపీగా గెలిస్తే అరాచకాలకు అడ్డు కట్ట ఉండదు: కడియం కావ్య
X

దిశ, వర్థన్నపేట: భూ బకాసురుడు అరూరి రమేష్ అని అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తే ఆయన అరాచకాలకు అడ్డు కట్ట ఉండదని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు.మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండల మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఐనవోలు మండల బూత్ ఇంచార్జ్ ల సమావేశంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ వర్ధన్నపేట, ఐనవోలు మండలాల మహిళలకు డాక్టర్ గా నే కాకుండా కడియం ఫౌండేషన్ ద్వారా కూడా మహిళల్లో రక్తహీనత రాకుండా న్యూట్రిషన్ కిట్స్, గర్భిణీ స్త్రీలు, విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలను చేసినట్లు చెప్పారు.వర్దన్నపేట ప్రభుత్వ అస్పత్రిలో డాక్టర్ గా 6ఏళ్ళు పని చేశానని గుర్తు చేశారు.మోడీ కి, రాహుల్ గాంధీ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దెవా చేశారు.ఐనవోలు మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్..

2015లో ఐనవోలు మండలంగా ఏర్పడిందని,కొత్తగా ఏర్పడిన మండలాన్ని దత్తత తీసుకున్ననని చెప్పారు.కొత్త మండలం లో కస్తూర్బా గాంధీ పాఠశాల ఉండాలని నేను డిప్యుటీ సీఎం గా ఉన్నపుడు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.కస్తూర్బా గాంధీ పాఠశాలను డిగ్రీ కళాశాలగా అభివృద్ధి చేస్తాను అని,ఐనవోలు దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నామనీ అన్నారు.అరూరి రమేష్ ప్రతి మండలానికి ఒక గెస్ట్ హౌస్ లు కట్టుకొని భూ కబ్జాలు చేసిండని చెప్పుకోచ్చారు.యశస్విని రెడ్డి దెబ్బకు దయాకర్ రావుకు పిచ్చి లేసింది.వందల ఎకరాలను కబ్జా చేసిన అరూరి రమేష్ మళ్ళీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వస్తున్నడనీ ప్రజల ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్,రాయపురం సాంబయ్య,సునీల్, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed