అవును మా వ్యాక్సిన్‌లు రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి: ఆస్ట్రాజెనెకా

by Disha Web Desk 17 |
అవును మా వ్యాక్సిన్‌లు రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి: ఆస్ట్రాజెనెకా
X

దిశ, నేషనల్ బ్యూరో: తన కోవిడ్ వ్యాక్సిన్‌‌లు రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ డ్రగ్‌మేకర్ కంపెనీ ఆస్ట్రాజెనెకా కోర్టులో అంగీకరించింది. అయితే చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిపింది. పేషెంట్ల భద్రతే తమ అత్యధిక ప్రాధాన్యత అని వ్యాక్సిన్‌లతో సహా అన్ని ఔషధాల సురక్షిత వినియోగాన్ని నిర్ధారించడానికి రెగ్యులేటరీ అధికారులు స్పష్టమైన, కఠినమైన ప్రమాణాలను కలిగి ఉన్నారని కంపెనీ మంగళవారం తెలిపింది. టీకా వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దుష్ప్రభావాలను కలిగిస్తాయని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.

UKలో అభివృద్ధి చేయబడిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసి కోవిషీల్డ్‌ పేరుతో విక్రయించింది. కరోనా సమయంలో ఈ టీకాలు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడ్డాయి. అయితే ఈ టీకా ప్రభావంతో UKలో కొన్ని మరణాలు సంభవించాయని దాదాపు 51 మంది బాధితులు కేసులు వేశారు. వారు మొత్తం 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్డులో తన వాదనలు వినిపించిన ఆస్ట్రాజెనెకా చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed