- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్/ నల్గొండ : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరిమలగిరి నందు జూలై 14 న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తారని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమ సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత 100 సంవత్సరాలలో భారతదేశంలోని ఏ రాష్ట్రము చేయని బీసీ కులగణన విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి, బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం అమలు కొరకు చట్టం తెచ్చామని, జూలై 10న నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రజల కోరిక మేరకు ఎస్సి వర్గీకరణ చేశామని బిసి కులగణన, ఎస్సి వర్గీకరణ అనే రెండు క్యాబినెట్ సబ్ కమిటిలకి చైర్మన్ గా తానే వ్యహరించానని తెలిపారు.
జూలై 14 న 5 లక్షల కార్డులు నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులని రేషన్ కార్డులలో చేర్చుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరనుందని అన్నారు. 13000 కోట్ల రూపాయలు ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం,అర్హులందరికీ రేషన్ కార్డుల ఇవ్వటం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తి ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి పేదవారికి ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారత దేశంలోనే లేవని అన్నారు. గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని కానీ మేము అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
సన్న బియ్యం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు రైతులకి 500 బినస్ ఇచ్చి, మిలర్ల ద్వారా మర ఆడించి సన్న బియ్యం సేకరిస్తున్నామని గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. ఖరీఫ్, రభీ సీజనలలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిభారతదేశం లోనే తెలంగాణ అగ్రగామిగా నిల్చిందని యాసంగి సీజన్ లో చివరి గింజ వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. ధాన్యం సేకరణ,సన్న బియ్యం పంపిణి,రేషన్ కార్డులు జారీ లాంటివి ప్రజలకి ఇచ్చి గ్రామీణ రైతులు బాగుండాలని తెలంగాణ సస్యాశ్యామలం అయ్యేలా ఈ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
జూలై 14 న వీరులు పుట్టిన పోరాటాల గడ్డ తుంగతుర్తి గడ్డ నుండి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేతులు మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణి చేసే బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. తుంగతుర్తి నియోజవర్గం బియన్ఆర్ లాంటి గొప్ప వీరులు జన్మించిన గడ్డ అని, తెలంగాణ సాయుధ పోరాటం లో భూమి, నీరు కోసం పోరాడిన వీరులెందరో పోరాడినారని అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మీ ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రతి రోజు రోడ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కాలేజీ లు, నీటి పారుదల ప్రాజెక్ట్ లు కొరకు నిరంతరం కృషి చేస్తున్నాడని గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని రీతిలో తుంగతుర్తి అభివృద్ధి చేసేందుకు నా వంతు సహాయం తప్పకుండ ఉంటుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.






