దిశ ఎఫెక్ట్.. కేసీఆర్ ఫోటో తొలగింపు

by Disha Web Desk 13 |
దిశ ఎఫెక్ట్..  కేసీఆర్ ఫోటో తొలగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో అధికారులు మార్పులు చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పాలకులు మారి రెండు నెలలు దాటుతున్నా ఇవాళ్టి వరకు ఆ శాఖకు సంబంధించిన వెబ్ సైట్ లో గత పాలకులైన కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డి, రావుల శ్రీధర్ ఫోటోలే కొనసాగాయి. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ గురువారం దిశ డైనమిక్ 1 పీఎం ఎడిషన్ లో 'వాళ్లకు ఇంకా సీఎం కేసీఆరే!' అనే శీర్షికతో కథనాన్ని వెలువరించింది. దీనిపై సంబంధిత అధికారులు గంటల వ్యవధిలో స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను తొలగించి ఆ స్థానంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను మార్చారు. కాగా ఇప్పటికే పలు ప్రజాసమస్యలపై గళం విప్పుతూ ప్రజలకు పరిష్కారాలు చూపడంలో ముందుంటున్న దిశ తాజాగా టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించి సక్సెస్ అయింది.



Next Story

Most Viewed