‘దిశ’ ఎఫెక్ట్... ఎస్సీ విద్యార్థులు ప్రతిభా ప్రోత్సాహకాలు అందజేతకు ప్రభుత్వం రంగం సిద్ధం

by Muthe.Rajitha |

‘దిశ’ ఎఫెక్ట్... ఎస్సీ విద్యార్థులు ప్రతిభా ప్రోత్సాహకాలు అందజేతకు ప్రభుత్వం రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎట్టకేలకు ప్రతిభా ప్రోత్సాహకాలకు అందజేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఏటా సదరు గురుకులాల్లో చదవి మంచి మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ పురస్కారాలు అందించేందుకు అధికారులు అంతా రెఢీ చేశారు. ఈ విషయంలో సోషల్​వెల్ఫేర్​ప్రిన్సిపల్​సెక్రటరీ నిర్వాకంతో కార్యక్రమం కాస్తా చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో దిశ సోషల్​వేల్ఫేర్ పై ప్రిన్సిపల్​సెక్రటరీ విముఖత.. ప్రతిభా ప్రోత్సాహకాల కార్యక్రమానికి సమయం ఇవ్వని ఐఏఎస్ ​శీర్షికన స్టోరీని ప్రచురించింది.

స్పందించిన సదరు ఉన్నత స్థాయి అధికారిలో కదలిక వచ్చింది. దీంతో ఎస్సీ విద్యార్థులు ప్రతిభా ప్రోత్సాహకాలు అందజేతకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28వ తేదీన ఎస్సీ గురుకులాల్లోని టాపర్స్​కు లాప్టాప్ లు, చెక్కుల పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. బంజారహిల్స్​లోని కొమురం భీం అడ్వైసరి భవన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఛీప్​గెస్టుగా సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు.

381 మంది ప్రతిభా పురస్కారాలు..

ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్, ఐఐటీ, ఎన్​ఐటీ, ఐఐఐటీ, జెఐపీఎంఈఆర్​తోపాటుగా జెఈఈ, మెడికల్​ఫలితాల్లో ర్యాంకులు సాధించిన 381 మంది ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఐఐటీ, ఎన్​ఐటీ, ఐఐఐటీ, జెఐపీఎంఈఆర్​ర్యాంకులు పొందిన 125 మంది స్టూడెంట్స్​కు లాప్ టాప్ లు ఇవ్వనున్నారు. అలాగే, టెన్త్​లో పది మంది టాప్ టెన్​స్టూడెంట్స్, ఇంటర్ స్టేట్ ర్యాంకులు సాధించిన 19 విద్యార్థులు, అలాగే, స్పోర్ట్స్ లో గోల్డ్ , సిల్వర్ , బ్రాంజ్ సాధించిన 39 విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన 162 విద్యార్థులు, పదో తరగతి, ఇంటర్ లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్స్ 14 మందికి, సీఎం ఫుట్ బాల్ కప్ విన్నెర్స్ 12 మందికి చెక్కులు పంపిణీ చేయనున్నారు.

Next Story