- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha effect: దిశ ఎఫెక్ట్.. అల్వాల్ డీసీపై చర్యలకు రంగం సిద్ధం
అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డిపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలకు సిద్ధమయ్యారు.

దిశ, సిటీ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై దిశ దినపత్రిక ప్రచురించిన కథనాల మేరకు అధికారులు స్పందించారు. ఈ నెల 5వ తేదీన దిశ డైనమిక్ 5 పీఎం ఎడిషన్‍లో అల్వాల్ లో భారీ భూకుంభకోసం అనే శీర్షికతో అక్కడ జరుగుతున్న అక్రమాలపై కథనం ప్రచురితమైంది. ఆ మరుసటి రోజు తెలంగాణ ఎడిషన్ లోనూ ఈ కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించగా విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి (Alwal DC Srinivas Reddy) అక్రమంగా ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు (house numbers allocation) కేటాయించినట్లు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలో డీసీ శ్రీనివాస్ రెడ్డిపై జీహెచ్ఎంసీ కమీషనర్ (GHMC Commissioner) చర్యలకు సిద్ధమయ్యారు.
ఇంటి నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ కు స్కెచ్ వేసి:
అల్వాల్ లోని 573, 574 సర్వే నంబర్లలో 9 ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. అయితే కోర్టు వివాదాల్లో ఉన్న భూమికి సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా 10 పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్టు, వాటిలో 80 ఫ్లాట్స్ ఉన్నట్లు డీసీ శ్రీనివాస్ రెడ్డి ఇంటి నంబర్లు కేటాయించారు. ఖాళీ స్థలానికి ఇంటి నంబర్స్ కేటాయించి ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ను సైతం కేటాయించారు. ఇంటి నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఈ స్కెచ్ వేశారు. ఈ వ్యవహారంలో డీసీ శ్రీనివాస్ రెడ్డిపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, స్టేట్ విజిలెన్స్ అధికారులకు బాధితుడు మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు. అలాగే ఇప్పటి వరకు జారీ చేసిన 80 ఇంటి నంబర్లను రద్దు చేశారు. తాజాగా విజిలెన్స్ నివేదికలో డీసీ శ్రీనివాస్ రెడ్డి బాగోతం బయటపడినట్లు తెలిసింది. ఈమేరకు ఈ డీసీపై చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ సిద్ధమైనట్లు సమాచారం.






