బ్రేకింగ్: రేపు టెన్త్ ఎగ్జామ్ యథాతధం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన క్లారిటీ

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: రేపు టెన్త్ ఎగ్జామ్ యథాతధం.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా నలుగురిని సస్పెండ్ చేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ శివ, ఇన్విజిలేటర్ బందెప్పతో పాటు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గోపాల్, సమ్మప్పలను సస్పెండ్ చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యుల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక, ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం సంచలం రేపడంతో రేపు జరగబోయే పరీక్ష వాయిదా పడుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. రేపు జరగబోయే పదవ తరగతి పరీక్షలు యథాతధంగా జరుగుతాయని దేవసేన స్పష్టం చేశారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

Also Read..

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ విద్యాశాఖలో భారీగా బదిలీలు


Next Story

Most Viewed