- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో ఆ నలుగురు నీచంగా ప్రవర్తిస్తున్నారు.. కలకలం సృష్టిస్తోన్న దిల్ రాజు వ్యాఖ్యలు
టాలీవుడ్‌లో ఎవరిదారి వారిదేనని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్‌లో ఎవరిదారి వారిదేనని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారని, ఇవాళ తాను మాట్లాడుతున్నాని, కానీ తామంతా కలిసి కదా మీడియాతో మాట్లాడాలి అని కామెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ వివాదంపై ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఇండస్ట్రీకి చెందిన వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కొవిడ్-19 వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. క్రమక్రమంగా భారత్‌లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,011కి చేరింది. గత వారం రోజుల్లోనే 750 మందికి కరోనా బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రాల వారీగా కేసుల వివరాలను వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 430 కేసులు నమోదు కాగా తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
హిందూ మతంపై దాడులు జరుగుతుంటే, భావోద్వేగాలు వ్యక్తపరచడం పౌర హక్కని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలపై రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయని, ఓడిన తర్వాత ట్యాంపర్అయ్యాయంటూ ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు. చెన్నై వేదికగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
సన్నిహితులు, స్నేహితులతో కలిసి సరదాగా పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటకలోని హనుమంత రాయప్ప అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సరదాగా రోడ్డు పక్కన పేకాట ఆడుతుండగా పోలీసులు అతన్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కారణంగా ఆయనను ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన హనుమంత రాయప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై సంచలన తీర్పుని ఇచ్చింది న్యాయస్థానం. అసలు సుప్రీం కోర్టు ఏమన్నదో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






