- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మెకు స్వస్తి.. సీఎం రేవంత్ రెడ్డికి దిల్ రాజు కృతజ్ఞతలు
గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది.

దిశ, వెబ్ డెస్క్ : గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఆగస్టు 4 నుంచి సమ్మెకు దిగడంతో గత 18 రోజులుగా టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్ ల షూటింగ్ నిలిచిపోయింది. అనేక చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోగా నేడు చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రేపటి నుంచి అన్ని రకాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. చర్చలు పరిష్కరించడానికి చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి TGFDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.
సినీ కార్మికులకు వేతనాలు పెంపుపై ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. కార్మికుల వేతనాలు 22.50 శాతం పెరగనున్నాయి. 2 వేల లోపు వేతనాలు ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు. 2 వేల నుంచి 5 వేల లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండవ, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంచనున్నారు. కాగా ఫెడరేషన్ మరో డిమాండ్ అయిన 9 టు 9 కాల్షీట్ కు కూడా ప్రొడ్యూసర్లు ఆమోదం తెలిపారు.
పెద్ద సినిమాలకు ఆదివారం పనిచేస్తే ఒకటిన్నర కాల్షీట్ కింద పరిగణించనున్నారు. చిన్న సినిమాలకు 2,4 ఆదివారాల్లో పని చేసినపుడు మాత్రమే ఒకటిన్నర కాల్షీట్ గా లెక్కలోకి తీసుకుంటామని ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. మిగిలిన అన్ని విషయాలు మీద నెలరోజుల్లో పరిష్కరించుకుంటామని, హైదరాబాద్ ను మూవీ హబ్ గా మారుస్తామని దిల్ రాజు వెల్లడించారు.






