అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.. మాజీ ఎంపీ వి.హన్మంత రావు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ (SIT) విచారణలో భాగంగా చాలా మందిని విచారించిందని, అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు.

అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా.. మాజీ ఎంపీ వి.హన్మంత రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ (SIT) విచారణలో భాగంగా చాలా మందిని విచారించిందని, అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. ఇది లోట్టపీసు కేసు అన్నది మీరే కదా.! మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆత్మగౌరవం, కక్ష సాధింపు చర్యలు అంటూ విమర్శిస్తున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆత్మగౌరవం గుర్తుకు వస్తోందని, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినప్పుడు ఆ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఇవాళ గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెడితే కూలగొట్టారని, కొత్త విగ్రహం చేయిస్తే దానిని దాచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేసు పెట్టి పోరాడి తాను ఆ విగ్రహాన్ని దక్కించుకున్నానని తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కక్ష సాధింపు, ఆత్మగౌరవం అంటున్నారని.. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఇలాంటివి ఎదుర్కోవాలని, తాము నిజాయితీపరులమని నిరూపించుకోవాలని వీహెచ్ హితవు పలికారు.

Next Story