- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్‍లకు సీఎంతో ఏం పని లేదు.. రేవంత్ వ్యాఖ్యలకు అర్వింద్ కౌంటర్
రెబల్స్ సర్పంచ్ లను కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాల్లో వేసుకుంటున్నారని ధర్మపురి అర్వింద్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకువస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కౌంటర్ ఇచ్చారు. నిధుల కోసం రేవంత్ రెడ్డి ఎక్కడికీ పోవాల్సిన పని లేదని పంచాయతీ ఖాతాల్లో కేంద్రం నేరుగా నిధులు జమ చేస్తుందన్నారు. సర్పంచ్ లకు సీఎంతో ఏం పని లేదన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‍లు, ఉప సర్పంచ్‍లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ నిజామాబాద్‍లో జరిగింది. ఈకార్యక్రమంలో మాట్లాడిన అర్వింద్.. రేవంత్ రెడ్డి సీఎం అయి రెండేళ్లు పూర్తయిందని ఈ రెండేళ్లు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే కేంద్ర నుంచి నిధులు రాలేకపోయాయని ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి నిధులు జమ చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, ఆ సంచులు మోయడం ఏమీ వద్దని ఎద్దేవా చేశారు. రెబల్స్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాల్లో వేసుకుంటున్నారని 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేవని దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కలేదన్నారు. మా ఖర్మ కొద్ది బీజేపీ టైమింగ్ సరిగా లేకపోవడం వల్ల తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చారన్నారు. నూతన పాలక వర్గాలు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు.
కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాదస్తం, వైరాగ్యం తప్ప తనకేమి కనిపించలేదని అర్వింద్ విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పమంటే పాత రామాయణం అంతా వినిపించారన్నారు. ఇక్కడున్న చాలా మందితో పాటు తాను కూడా గతంలో కేసీఆర్ అభిమానులమేనని చెప్పారు. నీటి అంశంలో మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నప్పటికీ ఆ జ్ఞానమంతా ఆయన కుటుంబానికి రూ40-50 వేల కోట్లు సంపాదించుకోవడానికి ఉపయోగించారు. కేసీఆర్ అంతా పాపాత్ముడు నబూతో న భవిష్యత్ అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సంగతి కవిత చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బీఆర్ఎస్ నాశనం చేసి ఇవాళ సూక్తులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.






