తెలంగాణ పోలీస్ దేశంలోనే అగ్రస్థానం.. నలంద విద్యాసంస్థలో డీజీపీ జితేందర్ స్ఫూర్తిదాయక ఉపన్యాసం

by Ramesh Naini |

దేశ వ్యాప్తంగా పోలీసులు పనితీరు పట్ల నిర్వహించిన నివేదికలో తెలంగాణ పోలీసుల దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.

తెలంగాణ పోలీస్ దేశంలోనే అగ్రస్థానం.. నలంద విద్యాసంస్థలో డీజీపీ జితేందర్ స్ఫూర్తిదాయక ఉపన్యాసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన పనిని మనమే మూల్యాంకన చేసుకోవాలి.. దేశ వ్యాప్తంగా పోలీసులు పనితీరు పట్ల నిర్వహించిన నివేదికలో తెలంగాణ పోలీసుల దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. గురువారం ఆయన వెంగళరావు నగర్‌లోని (Nalanda Educational Institute) నలంద విద్యాసంస్థల్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నైతిక నాయకత్వం, ప్రజా సేవ పట్ల నిబద్ధతతో పని చేసే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. జ్ఞానం, విలువల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన నాయకుల తరాన్ని మన విద్యా సంస్థలు మన దేశానికి అందించాలని అన్నారు.

విద్యార్థులు, విద్యారంగంలో రాణించడమే కాకుండా, విలువలు, వ్యక్తిత్వంతో ఎదగాలని సూచించారు. విద్య అనేది జ్ఞానాన్ని సంపాదించడం గురించి మాత్రమే కాదు.. స్వీయ-క్రమశిక్షణ, తెలివితేటలు, నైతిక విలువలతో వ్యక్తిత్వాన్ని రూపొందించడం గురించి కూడా అని చెప్పారు. విద్యార్థులు తమ అంతర్గత బలాలను పెంపొందించుకోవాలని, వారి నైతిక సామర్థ్యాన్ని గ్రహించాలని ఆయన సూచించారు. జీవితంలో సరైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని క్రమశిక్షణతో విద్యాను అభ్యసించాలని వెల్లడించారు.

మీలో ప్రతి ఒక్కరూ హనుమంతుడిలాగే మీలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. హనుమంతుడు తన అపారమైన శక్తిని తనకు గుర్తు చేసే వరకు గ్రహించలేదు.. అదేవిధంగా, చాలా సార్లు మీలో దాగి ఉన్న అసాధారణ ప్రతిభ, ధైర్యం, జ్ఞానం గురించి మీకు తెలియకపోవచ్చు. మేధస్సు వలనే అమెరికాలో మన భారతీయలు జనాభా 2 శాతం కానీ అమెరికా జీడిపీకి 8 శాతం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత మెంటర్ & law exallence సివిల్ సర్వీసెస్ రాంబాబు, నలంద విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ రాజు మంతెన, డైరెక్టర్ సూర్య మంతెన, అతిథులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story