ప్రశాంతంగా వినాయక నిమజ్జనం : డీజీపీ డాక్టర్ జితేందర్

by Naga Rani Yarlagadda |

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి శనివారం నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం : డీజీపీ డాక్టర్ జితేందర్
X
  • హైదరాబాద్ పరిసరాలలో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించాం..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి శనివారం నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. అడిషినల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ ఎం. భగవత్, ఐజీపీ పీ అండ్ ఎల్.ఎం. రమేష్, ఏఐజీ లా అండ్ ఆర్డర్ రమణ కుమార్, ఇతర అధికారులు సమీక్షలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో నిమజ్జనాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే విస్తృత భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని డీజీపీ తెలియజేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటలకు ముందే పూర్తయిందని, నెక్లెస్ రోడ్ హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద ఎత్తున నిమజ్జనాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఇతర జిల్లాలు, టీజీఎస్పీ బెటాలియన్లు, ఎడీఆర్ ఎఫ్, అటవీ, ఎక్సైజ్, ఆర్‌పీఎఫ్ వంటి ఇతర విభాగాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించామని డాక్టర్ జితేందర్ తెలిపారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లతో పాటు అన్ని కమిషనరేట్లు జిల్లాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఏరియల్ సర్వే చేస్తూన్నట్లు తెలిపారు. డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ అలాగే బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తునట్లు తెలిపారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ వ్యూ ద్వారా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ , జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనలతో పర్యవేక్షించినట్లు తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలను సమయానుసారం పూర్తి చేసి, పోలీసులు సూచిస్తున్న భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అందరూ సహకరించాలని డీజీపీ కోరారు.

Next Story