జిల్లాలో జరిగే నేరాలపై దృష్టి సారించాలి - డీజీపి జితేందర్

by velandi.Saikiran |

జిల్లాలో జరిగే నేరాలపై దృష్టి సారించాలి - డీజీపి జితేందర్
X

జిల్లాలో జరిగే నేరాలపై దృష్టి సారించాలి

ఇంటర్నల్ కో ఆర్డీనేషన్ విధానాన్ని అలవరుచుకొవాలి

హఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో సూచనలు చేసిన డీజీపి జితేందర్

దిశ, తెలంగాణ బ్యూరో : జిల్లాల పరిధిలో జరిగే నేరాలపై పోలీసు అధికారులు సమీక్షించాలని , ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం, ఇంటర్నల్ కో ఆర్డీనేషన్ విధానాన్ని అలవారుచుకొవలని డీజీపీ జితేందర్ పోలీసు అధికారలకు సూచించారు. ఏడీజీ సీఐడి చారుసిన్హా నేతృత్వంలో డీజీపీ కార్యాలయంలో హఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో అధికారుల, సిబ్బంది పనితీరు, నేరాల రేటు విశ్లేషణ, శిక్ష విధించే రేట్లను పెంచడం వంటి విషయాల పై ఎప్పటికప్పడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఆర్థిక నేరాలు, వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టడానికి, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడానికి , ప్రజా భద్రత పై నిఘా ఉంచాలని అన్ని యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రత, షీ టీమ్‌లు, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ , భరోసా కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమీక్షలో నేరాల ధోరణులు, శాంతిభద్రతల పరిస్థితులు, ప్రధాన కేసుల దర్యాప్తులో పురోగతి, ఆస్తి నేరాలు, మహిళలు, పిల్లలపై జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికలను ఏడీజీ సీఐడీ, డీజీపీకి అందజేశారు. ఈ సమావేశంలో సైబర్ సెక్యూరిటి బ్యూరో డీజీ శిఖా గోయల్ ఏడీజీ ఎల్ఓ మహేష్ భగవత్, ఏడీజీ పర్స్ అనిల్ కుమార్, ఐజీ పీ అండ్ ఎల్ఎం. రమేష్, మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రేంజ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలు పాల్గొన్నారు.

Next Story