ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయడం ఓ చరిత్ర.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Kema Shiva Kumar |

వరంగల్ (Warangal) రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇవాళ పరిశీలించారు.

ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయడం ఓ చరిత్ర.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ (Warangal) రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు ఆయన ఉదయాన్నే వందేభారత్ రైలులో హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కల సాకారం కాబోతుందని అన్నారు. మొత్తం 160 ఎకరాల్లో RMU నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 75 శాతం పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. దాదాపు రూ.521 కోట్లతో నిర్మాణ పనులు కొనసాగుతుండటం సంతోషకరమని అన్నారు.

ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత..

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Railway Coach Factory)లో భాగంగా ఆధునిక పరికరాలు అందుబాటులోకి రాబోతున్నాయని.. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. 16 కోచ్‌లతో కూడిన రాక్స్ ఉత్పత్తి జరగబోతుందని తెలిపారు. ఉద్యోగాల విషయంలో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. వాటర్ రీయూజ్ కోసం గ్రీన్ కాన్సెప్ట్‌తో నిర్మాణం జరుగుతుందని.. గూడ్స్ రైళ్లే రైల్వేశాఖకు ప్రధాన ఆదాయంగా ఉన్నాయని తెలిపారు. ఏకకాలంలో 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం ఓ చరిత్ర అని కిషన్ రెడ్డి అన్నారు.

Next Story