- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షీణిస్తున్న శాంతిభద్రతలతో రేవంత్ సర్కార్‌కు విపత్తే.. కేటీఆర్ సెన్సేషనల్ ట్వీట్
రాష్ట్రంలో వరుస కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుస కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంగళవారం మలక్‌పేట్ (Malakpet)లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందునాయక్ (Chandu Nayak)ను దుండగులు తుపాకీతో కాల్చి చంపిన విషయం విదితమే. అదేవిధంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ (Anil) అనుమానాస్పద మృతి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే పని చేస్తే ఏం జరగుతుందో చూస్తున్నామని కామెంట్ చేశారు.
దాదాపు రెండు సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఫుల్ టైమ్ హోంమంత్రి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి, అయన సోదరులు రాష్ట్రాన్ని తమ వ్యక్తిగత ఆధీనంలో ఉన్నట్లు నడిపిస్తే ఏమి జరుగుతుంది? ఎటువంటి అనుభవం, అవగాహన లేని అమాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే ఏమి జరుగుతుంది? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని.. కానీ కాంగ్రస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 24 గంటల్లోనే ఇద్దరు రాజకీయ నాయకులు కాల్చి చంపబడ్డారని ఫైర్ అయ్యారు. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, అభద్రతాభావం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ విపత్తుగా మారిందని అనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని కేటీఆర్ కామెంట్ చేశారు.






