- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దాపూర్ గురుకులంలో..పేరెంట్స్ తో డిప్యూటీ సీఎం భేటీ!
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి మంగళవారం డిప్యూటీ సీఎం వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులానికి మంగళవారం డిప్యూటీ సీఎం వెళ్లారు. ఈ పాఠశాలలో జరిగే పేరెంట్స్ మీటింగ్ లో ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పాఠశాలకు వచ్చిన మృతుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ఎలా చనిపోయారో చెప్పాలని, ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే తమ పిల్లల మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే అబద్దాలు చెప్పే ఉపాధ్యాయుల మాటలు తాము నమ్మటం లేదని, ఈ సందర్బంగా పిల్లల తల్లితండ్రులు ఉపముఖ్యమంత్రి భట్టీతో చెప్తూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో భట్టీ వారిని ఓదార్చారు. కాగా కొన్ని రోజుల క్రితం పెద్దాపూర్ గురుకులంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు చనిపోయిన సంగతి తెల్సిందే.! ఈ సందర్భంలో భట్టీ.. ఇద్దరు విద్యార్థుల మృతి మరియు నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ఇంకా పాఠశాలలో ఉన్న వసతులు, మొత్తం సిబ్బంది, డ్యూటీ నర్స్ కు సంబంధించిన వివరాలపై కూడా ఆరా తీశారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.






