- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Power cuts: విద్యుత్ కోతలపై ఎన్పీడీసీఎల్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు
by Ramesh Naini |
డిస్కం పరిధిలో ఏ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా కరెంట్ కోతలు అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: డిస్కం పరిధిలో ఏ స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా కరెంట్ కోతలు అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిస్కం పరిధిలో విద్యుత్ సరఫరాపై డిఫ్యూటీ సీఎం ఆరా తీశారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతిపాదించిన నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ.. వినియోగదారులకు ప్రస్తుతం అందుతున్న తరహాలో ఏ మాత్రం తేడా లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలన్నారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో సంస్థ డైరెక్టర్లు మోహన్ రావు, తిరుపతి రెడ్డి, మధుసూదన్, ప్రభాకర్ ఉన్నారు.
Next Story






